- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వచ్చే ఐపీఎల్ సీజన్ వరకు భారత జట్టు షెడ్యూల్ ఇదే
వచ్చే ఐపీఎల్ సీజన్ వరకు భారత జట్టు షెడ్యూల్ ఖరారు అయింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగిసిన నేపథ్యంలో ఇక అంతర్జాతీయ క్రికెట్ పైన భారత జట్టు దృష్టి పెట్టనుంది. ఇప్పటి నుంచి మళ్లీ ఐపీఎల్ 2027 ప్రారంభం అయ్యే వరకు ఫుల్ బిజీ కానుంది భారత్. వచ్చే ఏడాది కాలంలో మొత్తం 10 టెస్టులు, 20 వన్డేలు, 23 టీ20లు ఆడనుంది. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేలతో పాటు ఒక టెస్టు ఆడనుంది భారత్. ఆ తర్వాత ఐర్లాండ్ తో రెండు టీ20లు ఉంటాయి.
ఇంగ్లాండ్ వర్సెస్ భారత జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు ఉండనున్నాయి. అనంతరం జింబాబ్వే తో మూడు టీ20లు నిర్వహించనున్నారు. శ్రీలంకతో రెండు టెస్టులు, వెస్టిండీస్ తో 3 వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. న్యూజిలాండ్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. శ్రీలంక వర్సెస్ భారత జట్ల మధ్య 3 వన్డేలు, మూడు టీ20లు ఉంటాయి. జింబాబ్వే తో 3 వన్డేలు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ మధ్యలోనే ఆసియా గేమ్స్ కూడా నిర్వహించనున్నారు.
- Tags
- Indian team
- IPL






