- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన
2026 ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు బీసీసీఐ సుదీర్ఘ చర్చ అనంతరం భారత జట్టును ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: 2026 ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు బీసీసీఐ సుదీర్ఘ చర్చ అనంతరం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్ గా మరోసారి అక్షర్ పటేల్ కు అవకాశం దక్కింది. దీంతో శుభ్ మాన్ గిల్‌కు ఉహించని షాక్ తగిలింది. అలాగే చాలా రోజుల తర్వాత సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు జట్టులో చోటు దక్కింది. మొత్తంగా సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హర్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బూమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషన్ కిషన్ లకు జట్టులో చోటు దక్కింది. అలాగే గాయాలతో బాదపడుతున్న గిల్, యశస్వీ జైస్వాల్ లకు జట్టులో స్థానం దక్కలేదు. మొత్తంగా ఈ రోజు బీసీసీఐ 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది.






