విడాకులు తీసుకున్న మరో భారత క్రికెటర్.. కొన్ని బంధాలు శాశ్వతమైనవి కావంటూ ఎమోషనల్ పోస్టు

by Harish |

విడాకులు తీసుకున్న మరో భారత క్రికెటర్.. కొన్ని బంధాలు శాశ్వతమైనవి కావంటూ ఎమోషనల్ పోస్టు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్‌తో విడిపోయినట్టు ప్రకటించాడు. తాము విడాకులు తీసుకున్నట్టు శుక్రవారం వెల్లడించాడు. 2022లో రాహుల్, ఇషానీ వివాహం జరిగింది. కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. చాహర్ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘నేను చాలా తక్కువ వయసులోనే వివాహం చేసుకున్నాను. అప్పుడు నా విలువ, నేను నిర్మించుకోవాలకున్ను జీవితంపై నాకు అవగాహన లేదు. గత కొన్ని సంవత్సరాలు నేను ఊహించని పాఠాలు నేర్చుకున్నాను. గత 15 నెలలు కోర్టు చుట్టూ తిరిగాను. ఈ సమయం ఓపిక, ధైర్యం నేర్పింది. నా జీవితంలో ఓ అధ్యాయం చట్టపరంగా అధికారికంగా ముగిసింది. దీనికి నేను పశ్చాత్తాపం పడటం లేదు. కొన్ని బంధాలు శాశ్వతమైనవి కావు. మనల్ని మేల్కోల్పడానికి మాత్రమే.’అని చాహర్ భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టాడు. 26 ఏళ్ల చాహర్ ఇకపై పూర్తిగా క్రికెట్‌పై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరో భారత ఆటగాడు దీపక్ చాహర్.. రాహుల్ చాహర్‌కు సోదరుడు. క్రికెటర్లు యుజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.


Next Story