- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య కుమార్ ను అవమానించిన టిమ్ డేవిడ్...బంతి నాకుతూ మరీ!
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన టీమిండియా 167 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ కు ఘోర అవమానం

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య క్వీన్స్ ల్యాండ్ వేదికగా నాలుగో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పడుతూ లేస్తూ భారీ స్కోరే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన టీమిండియా 167 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు ఘోర అవమానం ఎదురయింది. ఈ మ్యాచ్ లో 10 బంతుల్లోనే 20 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ వికెట్ కోల్పోయాడు.
ఈ మ్యాచ్ లో జేవియర్ బార్ట్లెట్ ( Xavier Bartlett) బౌలింగ్ లో టిమ్ డేవిడ్ కు ( Tim David) క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు సూర్య కుమార్ యాదవ్. సిక్సర్ వెళ్తుంది అనుకున్న బంతిని టిమ్ డేవిడ్ అద్భుతంగా అందుకున్నాడు. తన చేతి వేళ్లతోనే ఆ బంతిని అందుకుని.. ఆ తర్వాత దాన్ని నాకే ప్రయత్నం చేశాడు. ఐస్ క్రీమ్ నాకినట్లుగానే సైగలు చేశాడు టిమ్ డేవిడ్. ఇక దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ ఆస్ట్రేలియా షేర్ చేసింది. ఇది చూసిన టీమ్ ఇండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ను అవమానించేలా టిమ్ డేవిడ్ వ్యవహరించాడని మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లను ఐపీఎల్ ఆడించకూడదని చురకలు అంటిస్తున్నారు. click






