- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ఫోకస్ అంతా దానిపైనే : హర్మన్‌ప్రీత్ కౌర్
by Harish |
టీ20 ప్రపంచకప్‌కు ముందు మానసికంగా బలంగా ఉండటంపై ఫోకస్ పెట్టినట్టు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది.

X
దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌కు ముందు మానసికంగా బలంగా ఉండటంపై ఫోకస్ పెట్టినట్టు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో ఆమె మాట్లాడుతూ..‘టీ20 క్రికెట్ చిన్న ఫార్మాట్ కాదు. మొత్తం 40 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. చివరి 4-5 ఓవర్లు చాలా కీలకం. అందుకే మేము చాలా కాలంగా మానసికంగా ధృఢంగా ఉండటంపై పనిచేస్తున్నాం. చివరి ఓవర్లలో మానసికంగా బలంగా ఉన్న జట్టే విజయం సాధిస్తుంది. చివరి ఐదు ఓవర్లలో మానసికంగా స్థిరంగా మన వ్యూహాలను అమలు చేయగలం.’ అని తెలిపింది. అలాగే, మేజర్ టోర్నీ ఫైనల్స్‌లో భారత్ తడబడటంపై స్పందిస్తూ..‘ఆ అంశాలపై మేము దృష్టిపెట్టాం. ఈ ప్రపంచకప్‌లో దాన్ని అధిగమిస్తామని ఆశిస్తున్నా.’ అని చెప్పింది. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భారత్ వచ్చే నెల 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
Next Story






