టీమిండియా ప్లేయ‌ర్ల‌కు హైద‌రాబాద్ బిర్యానీ తినిపించిన సిరాజ్‌

by velandi.Saikiran |

మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, అభిమన్యు ఈశ్వరన్‌, ముఖేష్ లాంటి టీమిండియా క్రికెటర్లు కూడా

టీమిండియా ప్లేయ‌ర్ల‌కు హైద‌రాబాద్ బిర్యానీ తినిపించిన సిరాజ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా ప్లేయర్లకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్. హైదరాబాద్ లో ఉన్న తన రెస్టారెంట్ కు మహమ్మద్ షమీతో పాటు ఇతర టీమిండియా క్రికెటర్లను ఆహ్వానించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ బిర్యానీ తో పాటు, తన రెస్టారెంట్ లో ఉన్న స్పెషల్ ఐటమ్స్ వాళ్లతో తినిపించాడు సిరాజ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, అభిమన్యు ఈశ్వరన్‌, ముఖేష్ లాంటి టీమిండియా క్రికెటర్లు కూడా ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. అయితే ఈ సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన టీమిండియా క్రికెటర్లను తన రెస్టారెంట్ కు ఆహ్వానించి, వాళ్లకు తేనేటి విందు ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా వన్డేలలో టీమిండియా బౌలింగ్ చెత్తగా తయారైందని, వెంటనే మహమ్మద్ సిరాజ్ తో పాటు మహమ్మద్ షమీని తుది జ‌ట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

Next Story