- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KL Rahul : టెస్టు మ్యాచులో భారత ఓపెనర్ సూపర్ సెంచరీ
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ వెస్టిండీస్ జట్టుపై సూపర్ సెంచరీ చేశాడు. వెస్టిండీస్ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ గురువారం ఉదయం ప్రారంభం అయింది.

దిశ, వెబ్ డెస్క్: భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) వెస్టిండీస్ (West Indies) జట్టుపై సూపర్ సెంచరీ (Century) చేశాడు. వెస్టిండీస్ జట్టుతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ గురువారం ఉదయం ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ దాటికి కుదేలైన వెస్టిండీస్ జట్టు కేవలం 162 పరుగులకు ఆలౌట్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ కలిపి మొదటి వికెట్ కు 68 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం సాయి సుదర్శన్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత గిల్‌తో కలిసి రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని అందించాడు ఈ క్రమంలో కెప్టెన్ గిల్ 50 పరుగుల వద్ద అవుట్ కాగా ప్రస్తుతం జురేల్ కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు రాహుల్. ఈ క్రమంలో లంచ్ బ్రేక్ సమయానికి ముందు రాహుల్ తన ఖాతాలో మరో టెస్ట్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచులో ఓపెనర్ గా వచ్చిన రాహుల్ ఇప్పటి వరకు 192 బందులను ఎదుర్కొని 12 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. అయితే లంచ్ సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, ద్రువ్ జురేల్ ఉన్నారు. ఈ మ్యాచులో భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది.






