- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బై బై పాకిస్థాన్ అంటూ ర్యాగింగ్ చేసిన లేడీ ఫ్యాన్స్..!
బై బై పాకిస్థాన్ అంటూ ర్యాగింగ్ చేసిన లేడీ ఫ్యాన్స్..పాకిస్థాన్ ఓటమి చెందిన నేపథ్యంలో దుబాయ్ ఈ సంఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. సూపర్ ఫోర్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగగా టీమిండియా గ్రాండ్ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఏకంగా ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసి దుమ్ము లేపింది టీమిండియా. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది.
అయితే ఆ లక్ష్యాన్ని టీమిండియా అవలీలగా చేదించింది. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసి విజయం సాధించింది. అభిషేక్ శర్మ , గిల్, తిలక్ వర్మ అద్భుతంగా రాణించడంతో మ్యాచ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఓ అరుదైన సంఘటన జరిగింది.
పాకిస్తాన్ ప్లేయర్లను ఉద్దేశించి.. ఇండియాకు చెందిన ఓ లేడీ ఫ్యాన్ దారుణంగా ట్రోలింగ్ చేసింది. మీరు ఓడిపోయారు... ఇంటికి వెళ్ళండి... బై బై పాకిస్తాన్ అంటూ దారుణంగా.. ర్యాగింగ్ చేస్తూ గట్టిగా అరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పాకిస్తాన్ పరువు మొత్తం తీసేలా.. ఆ లేడీ అభిమాని వ్యవహరిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్






