అదరగొడుతున్న మహిళల జూనియర్ హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం

by Harish |

నాలుగు దేశాల జూనియర్ హాకీ టోర్నీలో భారత మహిళల జూనియర్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

అదరగొడుతున్న మహిళల జూనియర్ హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : అర్జెంటీనాలో జరుగుతున్న నాలుగు దేశాల జూనియర్ హాకీ టోర్నీలో భారత మహిళల జూనియర్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం చిలీపై 2-1తో నెగ్గి టోర్నీలో శుభారంభం చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. 3-2తో ప్రత్యర్థిని మట్టికరిపించింది. మ్యాచ్‌లో ముందుగా ఉరుగ్వేనే ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక దశలో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, భారత్ బలంగా పుంజుకుని చివర్లో రెండు గోల్స్ చేయడంతో విజయం వరించింది. భారత్ తరపున కనిక సివాచ్ రెండు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. సోనమ్ కూడా గోల్ చేసింది. ఈ నెల 28న భారత్ తదుపరి మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడనుంది.


Next Story