భారత ఫుట్‌బాల్ టీంకు రెండో వరస్ట్ ర్యాంకు.. వరుస ఓటములతోనే!

by Phanindra |

భారత ఫుట్‌బాల్ టీం.. హిస్టరీలో రెండో వరస్ట్ ర్యాంకుకు దిగజారింది. వరుస ఓటములతోనే ఈ పరిస్థితి తలెత్తింది.

భారత ఫుట్‌బాల్ టీంకు రెండో వరస్ట్ ర్యాంకు.. వరుస ఓటములతోనే!
X

దిశ, స్పోర్ట్స్: భారత ఫుట్‌బాల్ జట్టు తొమ్మిదేళ్ల కనిష్ట ర్యాంకుకు దిగజారింది. తాజా ఫిఫా చార్ట్‌లో ఆరు స్థానాలు దిగజారిన భారత జట్టు 133వ ర్యాంకుకు చేరింది. జూన్ నెలలో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో 0-2 తేడాతో థాయ్‌ల్యాండ్ చేతిలో ఓడిన భారత్.. ఆ తర్వాత ఏసియాన్ కప్ క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లో హాంగ్ కాంగ్ చేతిలో 0-1 తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే హెడ్ కోచ్ మనోలో మార్కెజ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇలా పేలవ ప్రదర్శనలు చేసిన భారత్ ర్యాంకు పడిపోయింది. చివరగా 2016 డిసెంబరులో భారత జట్టు 135 ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత అత్యంత వరస్ట్ ర్యాంకు తాజాగా చేరిన 133వ ర్యాంకే. ఇక, భారత జట్టు బెస్టు ర్యాంకు 1996లో సాధించిన 96 కావడం గమనార్హం.

Next Story