డోపింగ్ టెస్టులో పట్టుబడిన భారత క్రికెటర్

by Harish |

ఉత్తరాఖండ్ బౌలర్ రజన్ కుమార్ డోపింగ్ టెస్టులో పట్టుబట్టాడు.

డోపింగ్ టెస్టులో పట్టుబడిన భారత క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : ఉత్తరాఖండ్ బౌలర్ రజన్ కుమార్ డోపింగ్ టెస్టులో పట్టుబట్టాడు. తాజాగా నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతను ఫెయిల్ అయ్యాడు. అతని శాంపిల్‌లో మూడు నిషేధిత పదార్థాలు పాజిటివ్‌గా తేలాయి. అనాబాలిక్ స్టెరాయిడ్స్ డ్రోస్టానోలోన్, మెటెనోలోన్, క్లోమిఫెన్‌లను గుర్తించారు. దీంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతనిపై తాత్కాలిక నిషేధం విధించింది. రజత్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నాడు. రజ్ కుమార్ డోపీగా తేలడం క్రికెట్‌లో కలకలం రేపింది. క్రికెట్‌లో డోపింగ్ కేసులు అరుదు. చివరిసారిగా చివరిసారిగా డోపింగ్‌లో దొరికి పోయిన స్టార్ క్రికెటర్ పృథ్వీ షా. 2019లో పృథ్వీ షా డోపింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. బీసీసీఐ అతనిపై 8 నెలల నిషేధం విధించింది.


Next Story