- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cheteshwar Pujara: భారత క్రికెటర్ పుజారా సంచలన నిర్ణయం
భారత క్రికెటర్ చేతేశ్వర్ పుజారా ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెటర్ చేతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు తాను రిటైర్మెంట్ (Retirement from international cricket) తీసుకుంటున్నట్లు ఆదివారం పుజారా ప్రకటించాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ సంచలన ప్రకటన చేశాడు. పుజరతా తన ట్వీట్‌లో.."రాజ్‌కోట్ అనే చిన్న పట్టణంలోని చిన్న పిల్లవాడిగా, నా తల్లిదండ్రులతో కలిసి, నేను స్టార్లను లక్ష్యంగా చేసుకోవడానికి బయలుదేరాను. భారత క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాను. ఈ ఆట నాకు చాలా ఇచ్చింది. అమూల్యమైన అవకాశాలు, అనుభవాలు, ఉద్దేశ్యం, ప్రేమ, అన్నింటికంటే ముఖ్యంగా నా రాష్ట్రాన్ని ఈ గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చింది.
భారత జెర్సీ ధరించడం, భారత గీతం పాడటం నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా వంతు ప్రయత్నం చేయడం - దాని నిజమైన అర్థాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. కానీ ప్రస్తుతం నేను అపారమైన కృతజ్ఞతతో అన్ని రకాల భారత క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను." అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే పుజారా 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి.. 103 టెస్టులు, 5 వన్డేలు, ఆడాడు. మొత్తం టెస్టుల్లో 7195 పరుగులు చేసిన అతను 19 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు చేశాడు. పుజారా చివరగా 2023లో ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచులో అడాడు. అతని నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.






