- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teamindia: నేను మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నా.. భారత క్రికెటర్ ప్రకటన
గతకొన్ని ఏళ్లుగా టీమిండియా(Teamindia) స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) ఫామ్‌లో లేక అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని ఏళ్లుగా టీమిండియా(Teamindia) స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul) ఫామ్‌లో లేక అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులోనూ అతడు విఫలం చెందుతున్నాడు. వరుస ఇన్నింగ్స్‌లలో అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. అంతేకాదు.. ఇటీవల ఐపీఎల్(IPL)లోనూ అతడిని పంజాబ్ జట్టు వదిలేసుకుంది. దీంతో రాహుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా.. ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎక్కడ ఫ్రీడమ్ దొరుకుతుందో ఆ జట్టులోనే ఆడాలనుకుంటున్నా. ప్లేయర్‌గా ప్రస్తుతం నా స్థానం ఏంటో నాకు తెలుసు. మళ్లీ భారత జట్టులో స్థానం ఎలా సంపాదించాలో కూడా తెలుసు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రాహుల్ చెప్పుకొచ్చారు.






