- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి వన్డేలో రెచ్చిపోయిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్
మొదటి వన్డేలో ఇంగ్లాండ్‌ను 258 పరుగులకే కట్టడి చేసిన భారత బౌలర్లు.. 4 వికెట్లతో మెరిసిన అక్షర్ పటేల్, భారత్ లక్ష్యం 259!

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే (First ODI)లో భారత ఫేసర్లు రెచ్చిపోయారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేసిన భారత బౌలర్లకు మొదట్లో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, బెతేల్ ఇబ్బంది కలిగించారు. మొదటి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరు దిశగా సాగుతున్న క్రమంలో యువ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒకే ఓవర్లో రెండు వికట్లు తీశాడు. అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 107 పరుగులో రూట్ మినహా టాప్ ఆర్డర్ మొత్తాన్ని కోల్పోయింది.
ఈ క్రమంలో రూట్, డాసన్ తో కలిసి 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నారు. అనంతరం 228 పరుగుల వద్ద 7వ వికెట్ల పడగా.. 258 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయింది. కానీ రూట్ మాత్రం 76 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కాగా ఈ మ్యాచులో భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ద్ కృష్ణ 2, అక్షర్ పటేల్ 4, దుబే, బుమ్రా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో భారత జట్టు విజయం సాధించాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 259 పరుగులు చేయాల్సి ఉంది.






