IND vs NZ : కివీస్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన భారత బౌలర్లు

by Muthe.Rajitha |

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్(ICC Champions Trophy) మ్యాచ్ నేడు న్యూజిలాండ్ vs భారత్(NewZealand vs India) మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.

IND vs NZ : కివీస్ దూకుడుకు అడ్డుకట్ట వేసిన భారత బౌలర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్(ICC Champions Trophy) మ్యాచ్ నేడు న్యూజిలాండ్ vs భారత్(NewZealand vs India) మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తొలుత దూకుడుగా ఆడింది. తొలి వికెట్ కోల్పోయే సమయానికి 7.5 ఓవర్లలోనే 58 పరుగులు చేసింది. విల్ యంగ్(Will Young) ను వరుణ్ చక్రవర్తి(Varun Chaktavarthy) ఔట్ చేయగా.. 10వ ఓవర్లో 69 పరుగుల వద్ద కుల్ దీప్ పెవిలియన్ కు పంపించాడు. అనంతరం కివీస్ ను మరింత కట్టడి చేసిన భారత బౌలర్లు.. మరో ఐదు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి మరో వికెట్ తీశారు. 15 ఓవర్ల వద్ద 3 వికెట్ల నష్టానికి కివీస్ 83 పరుగులు చేసింది. 25 ఓవర్ల వద్ద 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేశారు కివీస్ బ్యాటర్లు. ప్రస్తుతం 33 ఓవర్లకు 147 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది న్యూజిలాండ్. ఇక బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 1, కుల్ దీప్ 2, జడేజా 1 వికెట్ తీశారు.

Next Story