ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో రజత పతకం కొట్టిన అనీష్ భన్వాలా

by Malleboina Mahesh |

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌ పోటీలు ఈజిప్ట్‌లోని కైరో వేదికగా జరుగుతున్నాయి

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో రజత పతకం కొట్టిన అనీష్ భన్వాలా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌‌ (World Shooting Championship) పోటీలు ఈజిప్ట్‌లోని కైరో వేదికగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజ జరిగిన ఐఎస్సీఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్ అనీష్ భన్వాలా (Anish Bhanwala) మెరిసిపోయాడు. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. చివరి రౌండ్‌ వరకు జర్మనీకి చెందిన షూటర్‌తో పోటీ పడి తక్కువ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై భారత షూటింగ్ ప్రతిష్టను మరింత ఎత్తుకు చేర్చిన అనీష్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. హర్యానాకు చెందిన ఈ యువ షూటర్ గత కొన్ని నెలలుగా అద్భుత ఫామ్‌లో కొనసాగుతూ పలువురు ప్రముఖులను ఆకట్టుకున్నాడు. భారత షూటింగ్ సంఘం (NRAI) అనీష్ ప్రదర్శనను అభినందిస్తూ “దేశానికి మరో గర్వకారణం”గా పేర్కొంది. రాబోయే అంతర్జాతీయ పోటీల్లో కూడా అతను మెరుగైన ఫలితాలు సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేసింది.

Next Story