- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-నమీబియా మ్యాచ్..15 ఏళ్ల తర్వాత కోచ్ ప్రత్యక్షం
2011 సమయంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవడం వెనుక కోచ్ గారీ క్రిస్టెన్ హస్తం ఉంది. ఇప్పుడు కోచ్ గారీ క్రిస్టెన్ నమీబియా మెంటార్ గా పని చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో అరుదైన సంఘటన జరిగింది. గతంలో భారత జట్టుకు సేవలు అందించిన ప్రముఖ కోచ్ గారీ క్రిస్టెన్ ( Gary Kirsten ) దర్శనమిచ్చారు. నమీబియాతో గురువారం భారత్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా భారత జట్టుకు 15 సంవత్సరాల కిందట సేవలు అందించిన గారీ క్రిస్టెన్ దర్శనమిచ్చారు. 2011 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఈ సందర్భంగా భారత జట్టు ఛాంపియన్ గా అవతరించింది. అయితే 2011 సమయంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవడం వెనుక ఓ అదృష్ట శక్తి ఉంది.
నమీబియాలో జట్టులో మెరిసిన గారీ క్రిస్టెన్
సరిగ్గా 15 ఏళ్ల కిందట భారత జట్టును ధోని ఎంత ముందుకు తీసుకువెళ్లాడో, అంత కంటే ఎక్కువగా గారీ క్రిస్టెన్ ఇండియాను బాగా లీడ్ చేశాడు. ఫలితంగా ఆ సమయంలో వన్డే వరల్డ్ కప్ గెలిచింది ఇండియా. ఆ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు గారీ క్రిస్టెన్. అయితే ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు గారీ క్రిస్టెన్. టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా ఇండియా వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా మరోసారి గారీ క్రిస్టెన్ ప్రత్యక్షం అయ్యారు. అయితే ప్రస్తుతం నమీబియా జట్టుకు మెంటార్ గా గారీ క్రిస్టెన్ వ్యవహరిస్తున్నాడు. ఈ పసికూన నమీబియా జట్టును సానపెట్టే పనిలోపడ్డాడు గారీ క్రిస్టెన్. అందుకే గత కొన్ని రోజులుగా నమీబియా అద్భుతంగా రాణిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
నమీబియాపై 93 పరుగుల తేడాతో ఇండియా విజయం
ఐసీసీ వరల్డ్ కప్ 2026 లో తాజాగా భారత్, నమీబియా మ్యాచ్ జరగగా.. సూర్య కుమార్ యాదవ్ సేన అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో నమీబియా జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు భారత జట్టు. ఈ తరుణంలోనే నమీబియా పైన 93 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత జట్టు. ఈ మ్యాచ్ లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగుల టార్గెట్ నమీబియా ముందు ఉంచింది.
ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ఈ మ్యాచ్ లో రాణించారు. వాళ్ల ఊచకోత కారణంగా ఇండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అయితే 300 కు పైగా ఇండియా స్కోర్ చేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ ఇండియాను కట్టడి చేయడంలో నమీబియా సక్సెస్ అయింది. అయితే ఇండియా విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో నమీబియా ఏమాత్రం పోరాడలేదు. మ్యాచ్ కంటే ముందు ఓవర్ యాక్షన్ చేసిన నమీబియా కెప్టెన్ బౌలింగ్ లో రాణించాడు కానీ బ్యాటింగ్ లో హ్యాండ్ ఇచ్చాడు. దీంతో 18.2 ఓవర్లు ఆడిన నమీబియా 116 పరుగులకు కుప్పకూలింది. ఈ దెబ్బకు ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.






