- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INDvsAUS: సిరీస్ గెలిచిన భారత్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భారత్ - ఆస్ట్రేలియా(Australia vs India) మధ్య జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ రద్దు అయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భారత్ - ఆస్ట్రేలియా(Australia vs India) మధ్య జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ రద్దు అయింది. దీంతో సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. కాగా, ఆసీస్, భారత్‌ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవగా.. అనంతరం రెండు మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా గెలిచి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఇవాళ గబ్బా స్టేడియంలో జరిగాల్సిన చివరి టీ20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా అభిషేక్ శర్మ నిలిచారు. మరోవైపు.. మ్యాచ్ జరుగుతున్న గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. అక్కడ పిడుగులు పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను స్టేడియం అధికారులు అప్రమత్తం చేశారు. ప్రేక్షకులు బహిరంగ ప్రదేశాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్టేడియంలోని స్క్రీన్‌పై సూచించారు.






