- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: భారత్ హ్యాట్రిక్ విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC CHAMPIONS TROPHY, 2025)లో భారత్(India) ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్(New Zealand)పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 205 రన్స్ చేసి ఆలౌట్ అయింది. దీంతో ఈ ట్రోఫీలో భారత్‌కు హ్యాట్రిక్ విజయం దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో గ్రూప్-ఏలో భారత్ ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నెల 4న జరిగే తొలి సెమీస్‌లో ఆసీస్‌తో భారత్ తలపడనుంది. 5న దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది.
స్కోర్లు:
భారత్ బ్యాటింగ్: శ్రేయస్ అయ్యర్ (79,) హార్థిక్ పాండ్యా (45), అక్షర్ పటేల్ (42), రాహుల్ (23), జడేజా (16), రోహిత్ (15), కోహ్లీ (11), షమీ (5), గిల్ (2), కుల్ దీప్ 1 నాటౌట్.
న్యూజిలాండ్ బ్యాటింగ్: విలియమ్స్ (81), సాంట్నర్(28), విల్ యంగ్ (22), మిచెల్ (14), ఫిలిప్స్ (12), జమీసన్ (9) నాటౌట్, రవీంద్ర (9), బ్రాస్ వెల్ (2), హెన్రీ (2), ఒరూర్కే (1).
బౌలింగ్:
న్యూజిలాండ్ బౌలర్లు: హెన్రీ (5), జమీసస్, ఒరూర్కే సాంట్నర్‌తో పాటు రవీంద్రకు తలో వికెట్
టీమిండియా బౌలర్లు: వరుణ్ చక్రవర్తి (5), కుల్దీప్ యాదవ్ (2), పాండ్యా, అక్షర్ పటేల్, జడేజాకు తలో వికెట్






