- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కటక్ వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్ కైవసం
కటక్ వన్డే(Cuttack ODI)లో భారత్(Team India) ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్(England)పై భారత్ గెలుపొందింది.

దిశ, వెబ్‌డెస్క్: కటక్ వన్డే(Cuttack ODI)లో భారత్(Team India) ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్(England)పై భారత్ గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకున్నది. కాగా, తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ధ శతకాలతో పాటు లివింగ్‌స్టన్ (41 ), బ్రూక్(31), బట్లర్(34) కూడా రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
అనంతరం 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ(Rohit Sharma) 90 బంతుల్లో 119 చేశారు. ఇందులో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. చాలాకాలం తర్వాత సెంచరీ బాది ఫామ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. రోహిత్‌కు ఇది 32వ సెంచరీ కావడం విశేషం. గిల్(60), విరాట్(5), శ్రేయస్ అయ్యర్ (44), అక్షర్ పటేల్ (41), కేఎల్ రాహుల్ (10), హార్దిక్ పాండ్య (10), రవీంద్ర జడేజా (11*) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమీ ఒవర్టన్ 2, ఆదిల్ రషీద్, లివింగ్‌స్టన్, అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే బుధవారం (ఫిబ్రవరి 12) అహ్మదాబాద్‌లో జరగనుంది.






