- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Champions Trophy : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన భారత్
నేడు జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో భారత్ విజయాన్ని(India Won) అందుకొని, ట్రోఫీ చేజిక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : నేడు జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)లో భారత్ ఘన విజయాన్ని(India Won) అందుకొని, ట్రోఫీ చేజిక్కించుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నేడు న్యూజిలాండ్ vs భారత్(NewZealand vs India) మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో మరో ఓవర్ ఉండగానే చేధించి 254 పరుగులు చేసి, ట్రోఫీని ముద్దాడింది. టీంఇండియా జట్టులో రోహిత్ 76 పరుగులు చేసి, జట్టుకు దన్నుగా నిలవగా.. శ్రేయాస్ అయ్యర్ 48, గిల్ 31, అక్షర్ 29 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించారు. కాగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడవసారి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 63, మైకెల్ బ్రాస్ వెల్ 53, రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేయగా.. కుల్ దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ తీశారు.






