- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో టీ20లోనూ భారత్ విజయం
by velandi.Saikiran |
జింబాబ్వే రెండో టీ20లోనూ భారత జట్టు విజయం సాధించింది.

X
దిశ, వెబ్ డెస్క్: జింబాబ్వే రెండో టీ20లోనూ భారత జట్టు విజయం సాధించింది. అందరూ ఊహించినట్లుగానే, జింబాబ్వేను చిత్తు చేసి... ఏకంగా 90 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన భారత్, ఐదు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడిన జింబాబ్వే... 17.5 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి...2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది భారత్. ఈ మ్యాచ్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో విఫలమై బౌలింగ్ లో అదరగొట్టాడు. ఏకంగా మూడు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డి విరిచాడు. రవి బిష్ణోయ్, శివమ్ దుబే, తిలక్ వర్మ తలో వికెట్ తీశారు.
Next Story






