దక్షిణాఫ్రికాపై 101 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం

by Gantepaka Srikanth |

దక్షిణాఫ్రికాపై 101 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం

దక్షిణాఫ్రికాపై 101 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని కటక్ మైదానం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 101 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 175 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(59) అర్ధ సెంచరీతో రాణించాడు. తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు, సిపంమ్లా రెండు, ఫెరియెరా ఒక వికెట్‌ను పడగొట్టారు.

176 పరుగుల లక్ష్య చేధనలో బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. 12.3 ఓటర్లలో కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బూమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండేసి వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశారు.

Next Story