- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. టీ20 సిరీస్‌కు 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ అనుష్క శర్మ తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఆకట్టుకోవడంతో ఆమె పిలుపు అందుకుంది. అలాగే, ఫాస్ట్ బౌలర్ కాశ్వీ గౌతమ్ కూడా తొలిసారిగా టీ20 జట్టుకు సెలెక్ట్ అయ్యింది. ఆమె వన్డే, టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న వికెట్ కీపర్ ఉమా ఛెత్రి తిరిగి పొట్టి జట్టులో చోటు సంపాదించింది. అయితే, వైష్ణవి శర్మ, స్నేహ్ రాణా, కమలిని, అమన్‌జోత్ కౌర్ ఈ టూరుకు ఎంపిక కాలేదు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఏప్రిల్ 17న తొలి టీ20 జరగనుంది.19,22, 25, 27 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి. జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఈ సిరీస్ భారత్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, రేణుక ఠాకూర్, క్రాంతి, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వీ గౌతమ్, భార్తీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ






