ఇంగ్లాండ్ పై ప్రతీకారం..టీమిండియా గ్రాండ్ విక్టరీ

by velandi.Saikiran |   (  Updated:2025-06-28 17:01:32  IST  )

టీమిండియా ఉమెన్స్ టీం ( India Women) సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మహిళల ఇంగ్లాండ్ జట్టుపై (England Women)..

ఇంగ్లాండ్ పై ప్రతీకారం..టీమిండియా గ్రాండ్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ఉమెన్స్ టీం ( India Women) సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మహిళల ఇంగ్లాండ్ జట్టుపై (England Women).. గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ ప్రారంభమైన టి20 సిరీస్ లో... మహిళల టీమ్ ఇండియా జట్టు బోణి కొట్టింది. మొదటి మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి... 97 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మహిళల టీమిండియా.

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో... ఐదు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ దారుణంగా విఫలమైంది. 14.5 ఓవర్లలోనే మహిళల ఇంగ్లాండ్ జట్టు 113 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో 97 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ దెబ్బకు పురుషుల టీమిండియా ఓటమికి కారణమైన ఇంగ్లాండ్ పై ఈ విధంగా ప్రతి కారం తీర్చుకున్నట్లయింది.

ఈ మొదటి టి20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ స్మృతి మందాన 62 బంతుల్లోనే 112 పరుగులు చేసింది. ఇందులో 15 బౌండరీలు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. అలాగే హర్లిన్ కూడా 43 పరుగులతో రాణించింది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా భారీ స్కోరు చేసింది. అటు టీమిండియా బౌలర్లలో శ్రీ చరణి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. అలాగే దీప్తి శర్మ రెండు వికెట్లు, రాధా యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. అరుంధతి రెడ్డి, అమంజోత్ తలో వికెట్ తీశారు.

Next Story