India vs Ireland: సెంచరీలతో చెలరేగిన స్మృతి మంధాన, ప్రతికా రావల్ .. భారీ స్కోర్ దిశగా ఇండియా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-15 08:17:38  IST  )

మహిళల వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది..

India vs Ireland: సెంచరీలతో చెలరేగిన  స్మృతి మంధాన, ప్రతికా రావల్ .. భారీ స్కోర్ దిశగా ఇండియా
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ఉమెన్, ఐర్లాండ్ ఉమెన్(India Women vs Ireland Women) మధ్య వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తన ఇన్సింగ్స్‌ను కొనసాగిస్తోంది. భారత కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana ) చెలరేగిపోయారు. 135 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ప్రస్తుతం 38.2 ఓవర్లతో మ్యాచ్ నడుస్తోంది. ఒక వికెట్ కోల్పోయి పరుగులు 337 దాటాయి. అంతేకాదు భారీ స్కోర్ దిశగా ఇండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో ప్రతికా రావల్ (Pratika Rawal) సైతం చెలరేగిపోతున్నారు. సెంచరీని పూర్తి చేశారు. రీచా ఘోష్ (59)పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడు వన్డేల్లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి ఆధిక్యం ప్రదర్శించారు. స్వల్ప మార్పులతో బరిలోకి దిగిన స్మృతి మంధాన టీమ్ పరుగులు వరదను కొనసాగిస్తోంది.

Next Story