- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైజాగ్‌లో భారత్ ప్రిపరేషన్ క్యాంప్
త్వరలో జరగబోయే మహిళల ప్రపంచకప్‌కు బీసీసీఐ ఇప్పటికే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోక్ట్స్ : త్వరలో జరగబోయే మహిళల ప్రపంచకప్‌కు బీసీసీఐ ఇప్పటికే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు భారత జట్టు విశాఖపట్నంలో సన్నాహక శిబిరం ఏర్పాటు చేయనుంది. వారం పాటు భారత ప్లేయర్లు అక్కడే ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ప్రిపరేషన్ క్యాంప్ మొదలుకానుంది. వరల్డ్ కప్‌కు ఎంపికైన క్రీడాకారిణులతోపాటు భారత ఏ జట్టు ప్లేయర్లు కూడా ఈ శిబిరంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. ప్రిపరేషన్ క్యాంప్ కోసం వైజాగ్‌ను ఎంచుకోవడం వెనుక భారత జట్టు వ్యూహాత్మక ప్రణాళిక ఉంది. వైజాగ్‌లో భారత్ రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 9న సౌతాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలోనే పిచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సన్నాహక శిబిరం భారత్‌కు ఉపయోగపడనుంది. 2014లో టీమిండియా చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడింది. ఆసిస్‌తో సిరీస్‌కు ముందు విశాఖపట్నంలో రెండు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇటీవలలో బెంగళూరులో భారత జట్టు 10 రోజుల క్యాంప్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ ఫిట్‌నెస్, ఫీల్డింగ్, మ్యాచ్ పరిస్థితులపై దృష్టి పెట్టారు. వైజాగ్ క్యాంప్ అందుకు పొడిగింపుగా భావించొచ్చు.






