కుర్రాళ్లు మళ్లీ కొట్టేశారు.. అండర్-19 వరల్డ్‌కప్ విజేత భారత్

by Gantepaka Srikanth |

అండర్-19 వన్డే ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది.

కుర్రాళ్లు మళ్లీ కొట్టేశారు.. అండర్-19 వరల్డ్‌కప్ విజేత భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: అండర్-19 వన్డే ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. ఎక్కడా ఇంగ్లాండ్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ప్రారంభం నుంచే పైచేయి సాధించారు. ఇంగ్లాండ్‌పై ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. దీంతో ఆరోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుతున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (175) మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే అర్ధ శతకం(53)తో రాణించగా.. అభిజ్ఞాన్‌ కుందు(40), వేదాంత్‌ త్రివేది (32) పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జేమ్స్‌ మింటో 3, మోర్గాన్‌ 2, అలెక్స్‌ గ్రీన్‌ 2, మానీ ఒక వికెట్‌ తీశారు.

412 పరుగుల భారీ లక్ష్య చేధనలో క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కూడా పర్వాలేదనిపించారు. ఓపెనర్ బెన్‌ డాకిన్స్‌ 66 పరుగులతో చెలరేగిపోయారు. ఆ తర్వాత బెన్‌ మేయెస్ 45, ఫాల్కనర్ 115 పరుగులు, థామస్ 31, జేమ్స్ మింటో 28 పరుగులు చేశారు. మొత్తంగా 40.2 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ 311 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అంబ్రీష్ మూడు, దేవేంద్రమ్, చౌహాన్ చెరో రెండు, పటేల్, ఆయూష్ తలో వికెట్ తీశారు.

Next Story