- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్చరీ వరల్డ్ కప్‌లో మెరిసిన తెలుగు కుర్రాడు.. ధీరజ్ బృందానికి రజత పతకం
by Harish |
అమెరికాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది.

X
దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు రజత పతకం సాధించింది. స్వర్ణ పతక ఆశలు రేపిన ధీరజ్ బృందం ఫైనల్‌లో తడబడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్ 1-5 తేడాతో చైనా చేతిలో పరాజయం పాలైంది. తొలి సెట్‌లో 54-54తో సమంగా నిలిచిన ధీరజ్ జట్టు ఆ తర్వాత తడబడింది. మిగతా రెండు సెట్లలలో వరుసగా 55-58, 54-55లతో వెనుకబడి రజతంతోనే సరిపెట్టింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో పతకం. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ స్వర్ణం గెలువగా.. పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.
Next Story






