- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు గోల్డ్ మేడల్
చైనాలోని బైదాయ్‌లో జరిగిన 2025 స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్లో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: చైనాలోని బైదాయ్‌లో జరిగిన 2025 స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్లో (Speed Skating World Championship) భారత్ గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించింది. ఈ రేసు ఫైనల్ లో భారత తరుపున పాల్గోన్న స్పీడ్‌స్టర్ ఆనంద్‌కుమార్ వెల్‌కుమార్ (Anand Kumar Velkumar) చరిత్ర సృష్టించాడు. సీనియర్ విభాగంలోని 1000 మీటర్ల స్ప్రింట్ రేసు (1000 meter sprint race)లో 1:24.924 సెకన్ల టైమ్‌తో గోల్డ్ మెడల్ సాధించి, భారత్ తరఫున ఈ టోర్నీలో తొలిసారిగా బంగారు పతకం గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు, ఆయన 500 మీటర్ల స్ప్రింట్‌లో బ్రోన్జ్ గెలిచి, దేశానికి మరో గౌరవాన్ని తీసుకువచ్చాడు. ఈ విజయాలతో ఆనంద్‌కుమార్ వెల్‌కుమార్ పేరు ప్రపంచ స్థాయిలో మెరిసింది. ఇదే ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో భారత ఆటగాడు క్రిష్ శర్మ కూడా 1000 మీటర్ల స్ప్రింట్‌లో గోల్డ్ మెడల్ సాధించడం తో, భారతదేశం రెండు రోజుల వ్యవధిలో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకుంది. ఆనంద్‌కుమార్ విజయాన్ని కేవలం వ్యక్తిగత ఘనతగా కాకుండా, దేశంలో స్పీడ్ స్కేటింగ్ క్రీడకు ఒక కొత్త దిశ చూపిన చారిత్రాత్మక మైలురాయిగా పరిగణిస్తున్నారు.






