- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kabaddi : ఆసియా చాంపియన్‌గా భారత్.. ఐదోసారి ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్ కైవసం
ఆసియాలో భారత మహిళల కబడ్డీ జట్టుకు ఎదురులేకుండా పోయింది. ఐదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియాలో భారత మహిళల కబడ్డీ జట్టుకు ఎదురులేకుండా పోయింది. ఐదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. ఏసియన్ కబ్డడీ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో శనివారం జరిగిన ఫైనల్‌లో ఆతిథ్య ఇరాన్‌ను భారత జట్టు చిత్తు చేసింది. 32-25 తేడాతో విజయం సాధించింది. భారత్‌కు విజయం అంత తేలికగా దక్కలేదు. ఇరాన్ నుంచి గట్టిపోటీనే ఎదుర్కొంది. ప్రత్యర్థి బలమైన డిఫెన్స్‌తో ఇబ్బందిపెట్టింది. కానీ, భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి విజేతగా నిలిచింది. ఆరు ఎడిషన్లలో భారత్ ఐదుసార్లు టైటిల్ గెలవడం విశేషం. ఇంతకంటే ముందు 2005, 2007, 2008, 2017 ఎడిషన్లలో టైటిల్ సాధించింది. అలాగే, ప్రస్తుత టోర్నీని ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా అజేయంగా ముగించడం మరో విశేషం. గ్రూపు దశలో బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేసియాలపై నెగ్గగా.. సెమీస్‌లో నేపాల్‌పై భారీ విజయం నమోదు చేసింది.






