మరో ప్రపంచకప్ సాధించిన భారత్

by Gantepaka Srikanth |

మరో ప్రపంచకప్ సాధించిన భారత్ జట్టు

మరో ప్రపంచకప్ సాధించిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు అదరగొట్టేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే నాలుగు ప్రపంచకప్‌లు సాధించారు. టీమిండియా పురుషుల జట్టు 20 ప్రపంచకప్ సాధించగా, మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించింది. నిన్న అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు విజయం సాధించి.. వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. తాజాగా భారత్‌కు మరో వరల్డ్ కప్ దక్కింది. మహిళల కబడ్డీ ప్రపంచకప్‌(2025 Kabaddi World Cup) విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్‌లో చైనీస్‌ తైపీ జట్టును మట్టికరిపించింది. చైనీస్‌ తైపీ జట్టును 35-28 తేడాతో భారత్ ఓడించింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ నిలవడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు. రీతూ నేకి కెప్టెన్సీలో భారత మహిళా కబడ్డీ టీమ్ రికార్డు సృష్టించింది. ఈ జట్టులో ఐదుగురు హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన వారే కావడం విశేషం.

Next Story