రెండో టెస్ట్ లో టీమిండియా విక్ట‌రీ..సిరీస్ కైవ‌సం

by velandi.Saikiran |   (  Updated:2025-10-14 06:39:50  IST  )

ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విక్టరీ సాధించింది. వెస్టిండీస్ పైన ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట

రెండో టెస్ట్ లో టీమిండియా విక్ట‌రీ..సిరీస్ కైవ‌సం
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా విక్టరీ సాధించింది. వెస్టిండీస్ పైన ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ విజయంతో 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అంటే ఈ టోర్నమెంట్ లో వెస్టిండీస్ ను వైట్ వాష్‌ చేసింది గిల్ సేన. రెండో ఇన్నింగ్స్ లో 121 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆచితూచి ఆడిన టీమిండియా చివరికి మ్యాచ్ గెలిచింది.

రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ 58 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 39 పరుగులతో రాణించారు. అటు ఇవాళ మరో రెండు వికెట్లు కోల్పోయిన జట్టును విజయతీరాలకు చేర్చాడు కేఎల్ రాహుల్. ఇక అంతకుముందు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 518 పరుగులు చేసి డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు కుప్పకూలింది వెస్టిండీస్. దీంతో ఫాలోవన్ ఆడాల్సి వచ్చింది వెస్టిండీస్. ఇక రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసిన వెస్టిండీస్ ఓడిపోయింది. దీంతో విండీస్ ను టీమిండియా 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది.

Next Story