- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాంపియన్స్ ట్రోఫీ విజేత భారతే.. ఫైనల్‌లో ఆసిస్‌ను ఓడిస్తుంది.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జోస్యం
చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంటుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను.. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. ఫైనల్‌లో ఆసిస్‌కు ఓటమి తప్పదని, భారత్ ఒక్క పరుగు తేడాతో నెగ్గి విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు.‘నేను ఆసిస్ గెలవాలని కోరుకుంటున్నా. కానీ, భారతే చాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం భారత్ అత్యుత్తమంగా ఉంది. వన్డేల్లో నం.1 జట్టు. ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడతాయి. టీమిండియా ఒక్క రన్ తేడాతో విజయం సాధిస్తుంది.’ అని తెలిపాడు. అలాగే, రోహిత్ తిరిగి ఫామ్ అందుకున్నాడని, చాంపియన్స్ ట్రోఫీలో అతనే టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని చెప్పాడు. ‘అతను పవర్ ప్లేలో దూకుడుగానే ఆడాలి. అతను రిస్క్ తీసుకుంటాడు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్. భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినా, రోహిత్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచినా నేను ఆశ్చర్యపోను.’ అని చెప్పుకొచ్చాడు.






