బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టింది పాకే.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

by Harish |

బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టింది పాకే.. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో టీ20 వరల్డ్ కప్‌ ఆడొద్దని బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ రెచ్చగొట్టిందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆరోపించారు. ఆటగాళ్ల భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో ప్రపంచకప్ ఆడటానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వరల్డ్ కప్ ఆడనుంది. తాజాగా శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఆడాలనే బీసీసీఐ కోరుకుందన్నారు. బంగ్లా జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. కానీ, బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ జట్టును పంపలేమని చెప్పిందని, చివరి నిమిషంలో షెడ్యూల్‌ను మార్చడం చాలా కష్టమన్నారు. అయితే, బంగ్లా నిర్ణయం వెనుక పాక్ పాత్ర ఉందని శుక్లా ఆరోపించారు. ‘పాక్ అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. బంగ్లాను పక్కదారిపట్టించింది. వారిని రెచ్చగొట్టింది. బంగ్లా దేశస్థులపై ఎలాంటి పాక్ దారుణాలకు పాల్పడిందో ప్రపంచానికి తెలుసు. బంగ్లా ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు పాక్ వారిని మోసగించాలని చూస్తోంది. తప్పుడు మార్గంలో నడిపిస్తోంది.’అని శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.


Next Story