- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ vs శ్రీలంక WT20... భారత్ టార్గెట్ ఎంతంటే?
by Muthe.Rajitha |
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులే చేసింది. హర్షిత (33), చమరి ఆటపట్టు (31), హాసిని పెరీరా (22) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి, వైష్ణవి శర్మ తలా రెండు వికెట్లు, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలా ఒక్కో వికెట్ తీశారు. తొలి ఓవర్లోనే విష్మి గుణరత్నే వికెట్‌తో షాక్ ఇచ్చిన భారత్, అనంతరం అన్ని ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో శ్రీలంక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. కాగా కాగా 129 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు రెండో విజయంపై కూడా కన్నేసింది.
Next Story






