ఇండియా vs సౌతాఫ్రికా 4th టీ20 రద్దు!

by Muthe.Rajitha |

ఇండియా vs సౌతాఫ్రికా మధ్య నేడు జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇండియా vs సౌతాఫ్రికా 4th టీ20 రద్దు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా vs సౌతాఫ్రికా మధ్య నేడు జరగాల్సిన 4వ టీ20 మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ లో సాయంత్రం 6.30 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా.. తీవ్ర పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటీ లేదని అంపైర్లు ఆటను వాయిదా వేశారు. రాత్రి సమయం గడుస్తున్న కొద్దీ పొగమంచు తీవ్రం అవుతుండటంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందిగ్దత నెలకొంది. తీవ్రమైన పొంగమంచు వలన ప్లేయర్స్ అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉండటంతో ఆట రద్దయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆటపై అంపైర్లు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 5 టీ20 మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే భారత్ 2-1 ఆధిక్యంలో ఉండగా... సౌతాఫ్రికా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ ఇది.

Next Story