India vs South Africa : టీమిండియా ఆల్‌రౌండ్ షో.. మూడో టీ20 మనదే

by Harish |

సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో రెండో టీ20లో పరాజయం పాలైన భారత్ తిరిగి పుంజుకుంది.

India vs South Africa : టీమిండియా ఆల్‌రౌండ్ షో.. మూడో టీ20 మనదే
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో రెండో టీ20లో పరాజయం పాలైన భారత్ తిరిగి పుంజుకుంది. మూడో టీ20లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ జట్టులో మార్‌క్రమ్(61) తర్వాత ఎవరూ రాణించలేదు. భారత బౌలర్ల ధాటికి డికాక్(1), హెండ్రిక్స్(0), బ్రెవిస్(2), స్టబ్స్(9), కార్బినో బోష్(4), జాన్సెన్(2) తేలిపోయారు. భారత బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్ల సత్తాచాటి సఫారీల పతనాన్ని శాసించారు. అనంతరం 118 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 15.5 ఓవర్లలో ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 120 రన్స్ చేసింది. అభిషేక్(35) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించగా.. గిల్(28), తిలక్(25 నాటౌట్) విలువైన రన్స్ జోడించారు. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.


Next Story