- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా..కొత్త ప్లేయర్లతో రంగంలోకి భారత్
దక్షిణాఫ్రికా టాస్ నెగ్గి, బౌలింగ్ తీసుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్: కటక్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 ఇవాళ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తొలి టి20 మ్యాచ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. దీంతో భారత జట్టుకు మరోసారి టాస్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా, బౌలింగ్ తీసుకుంది. ఈ తరుణంలో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.
ఈ కటక్ పిచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లకే విజయావకాశలు ఉన్న తరుణంలో దక్షిణాఫ్రికా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అటు ఇవాళ్టి మ్యాచ్ లో భారీ మార్పులతో భారత జట్టు రంగంలోకి దిగింది. సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా లాంటి ప్లేయర్లను పక్కకు పెట్టిన భారత జట్టును కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకుంది. సంజూ స్థానంలో జితేష్ శర్మ వికెట్ కీపింగ్ చేయనున్నాడు. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చేశారు.






