- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ vs పాకిస్తాన్.. మహిళల క్రికెట్‌లోనూ ముదురుతున్న వైరం
ప్రపంచ క్రికెట్‌లో భారత్ - పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో భారత్ - పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇన్నాళ్లు రెండు దేశాల జట్ల మధ్య మ్యాచ్ జరిగినంత సేపు రసవత్తరంగా కనిపించినా.. ఆ తర్వాత క్రీడాకారులు ఫ్రెండ్లీగానే కనిపించేవారు. కానీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితి మారింది. మ్యాచ్‌కు ముందు.. మ్యాచ్ అనంతరం రెండు దేశాల క్రీడాకారులు కనీసం కరచాలనం కూడా ఇచ్చుకోవడం లేదు. ఆసియా కప్‌లో భారత్ - పాక్ మధ్య మూడు మ్యాచులు జరుగగా.. మూడు మ్యాచుల్లోనూ వారితో దూరంగానే ఉన్నారు.
అయితే ఇప్పుడిది మహిళల క్రికెట్‌కూ పాకింది. ఇవాళ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా.. శ్రీలంకలోని కొలంబో మైదానంలో భారత్ - పాక్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో క్రికెట్‌లోనూ వైరం ముదురుతోందని నెట్టింట విస్తృత చర్చ జరుగుతోంది.






