భారీ స్కోర్ చేసిన పాకిస్తాన్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

by velandi.Saikiran |

నిర్ణీత‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్... 171 పరుగులు చేసింది.

భారీ స్కోర్ చేసిన పాకిస్తాన్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో సల్మాన్ అఘా జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్... 171 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ రెండు క్యాచ్ లు టీమిండియా ప్లేయర్లు వదిలివేశారు.

దీంతో ఈ అవ‌కాశాన్ని అద్భుతంగా వినియోగించుకొని ఫర్హాన్ 58 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన అయూబ్... 21 పరుగులు చేశాడు. సల్మాన్ అఘా 17, అలాగే అష్రాఫ్ 20 పరుగులు చేశారు. దీంతో పాకిస్తాన్ 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శివం దూబే రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా మరోటి అలాగే కుల్దీప్ యాదవ్ మరొకటి తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో 172 ప‌రుగులు చేస్తే టీమిండియా విజ‌యం సాధిస్తుంది.

Next Story