భారత్, పాక్ మ్యాచ్ ఇతర గేముల్లా కాదు : గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన రవిశాస్త్రి

by Harish |

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ ఇతర మ్యాచ్‌ల కంటే భిన్నమైందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

భారత్, పాక్ మ్యాచ్ ఇతర గేముల్లా కాదు : గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ ఇతర మ్యాచ్‌ల కంటే భిన్నమైందని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఈ నెల 13న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. దాయాదుల పోరును ఇతర మ్యాచ్‌ల్లాగే చూస్తామని ఇటీవల హెడ్ కోచ్ గంభీర్ తెలిపాడు. తాజాగా ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి.. గంభీర్ వ్యాఖ్యలపై స్పందించాడు. గతంలో తాను కూడా గంభీర్‌‌లాగే చెప్పేవాడినని, కానీ భారత్, పాక్ మ్యాచ్ ఇతర మ్యాచ్‌ల్లా కాదన్నాడు. ‘దాయాదుల పోరులో కచ్చితంగా గెలవాల్సిందే. లేకపోతే పాక్‌తో మళ్లీ ఆడేవరకు దీని గురించే చర్చిస్తారు. గత 10 గేముల్లో 8 లేదా 9 గెలిచినా పట్టించుకోరు. ఒక్కటి ఓడినా తర్వాతి మ్యాచ్ వరకూ మాట్లాడుకుంటూనే ఉంటారు. భారత్‌కు ఏమైంది? అనుకుంటారు. పాక్‌ జట్టు పరిస్థితి కూడా అంతే. కాబట్టి భారత, పాక్ మ్యాచ్ ఇతర మ్యాచ్‌లతో పోలిస్తే పూర్తిగా వేరు’ అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.


Next Story