- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్, పాక్ మ్యాచ్‌పై హర్భజన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు పాకిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు పాకిస్తాన్ కనీసం పోటీ కూడా ఇవ్వదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు. ఈ నెల 23న భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దాయాదుల పూరుపై నెలకున్న హైప్‌పై హర్భజన్ స్పందించాడు. ఈ మ్యాచ్‌పై ఎక్కువ హైప్ పెంచుకోవద్దని ఫ్యాన్స్‌ను హెచ్చరించాడు. అభిమానులు ఆశించినంత పోటీ ఉండదని, భారత్ ఏకపక్షంగా మ్యాచ్‌ను గెలుచుకుంటుందని చెప్పాడు. భారత్‌పై పాక్ బ్యాటర్ల గణాంకాలు బాగా లేవని వివరించాడు. ‘భారత్‌పై పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ సగటు 31. అతను టాప్ బ్యాటర్ అయితే సగటు 50 ఉండాలి. రిజ్వాన్ సగటు 25. ఓపెనర్ ఫకర్ జమాన్ సగటు 46. ఇది మంచి సగటే. భారత్ నుంచి మ్యాచ్‌ను దూరం చేయగల సత్తా అతనికి ఉంది. ఫహీమ్ అశ్రఫ్ ఆవరేజ్ 12.5, సౌద్ షకీల్ సగటు 8. వీళ్లు ప్రమాదకరమని భావించడం లేదు. పాక్ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఆ జట్టు భారత్‌కు కనీసం పోటీ కూడా ఇస్తుందన్న నమ్మకం లేదు.’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇరు జట్లు గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో చివరిసారిగా ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 6 రన్స్ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.






