- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాకు భారీ షాక్.. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి మ్యాచ్ కోల్పోవడంతో వన్డే సిరీస్ కూడా భారత్ చేజారిపోయింది. 2-1తో సిరీస్ కివీస్ కైవసమైంది. మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. మిచెల్(137), ఫిలిప్స్(106) సెంచరీలతో రెచ్చిపోవడంతో కివీస్.. భారత్ ముందు 338 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. ఛేదనకు దిగిన టీమిండియా 46 ఓవర్లలో 296 పరుగులకే కుప్పకూలింది. జట్టును గెలిపించడానికి విరాట్ కోహ్లీ(124) తీవ్రంగా పోరాడాడు. కానీ, అతని శ్రమ ఫలించలేదు. నితీశ్ కుమార్ రెడ్డి(53), హర్షిత్ రాణా(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే, రోహిత్(11), గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) వంటి టాప్ బ్యాటర్లు నిరాశపర్చడం భారత్ ఓటమికి కారణమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.






