- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Women’s Asia Cup Hockey : ఆసియా కప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్‌లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఫైనల్ బెర్త్ భారత్‌ను కాస్త టెన్షన్ పెట్టింది. శనివారం జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ 1-1తో జపాన్‌తో డ్రా చేసుకుంది. గేములో ముందుగా టీమిండియా శుభారంభమే చేసింది. 7వ నిమిషంలోనే డుంగ్ డుంగ్ గోల్ అందించింది. కానీ, చివరి వరకూ మరో గోల్ చేయలేకపోయింది. కానీ, అద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని గోల్ చేయకుండా నిలువరించింది. మరో రెండు నిమిషాలు అలాగే అడ్డుకుంటే భారత్ 1-0తో గెలిచేది. కానీ, జపాన్ ప్లేయర్ కుబయకావ 58వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. మిగతా రెండు నిమిషాల్లో ఏ జట్టూ మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే నేరుగా ఫైనల్‌కు చేరుకునేది. దీంతో ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా.. చైనా, సౌత్ కొరియా మ్యాచ్‌పై ఆధారపడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో సౌత్ కొరియాను 0-1తో చైనా ఓడించడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. సౌత్ కొరియా గెలిస్తే ఫైనల్ ఆశలు గల్లంతయ్యేవి. ఇటీవల పురుషుల జట్టు ఆసియా కప్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహిళల జట్టు కూడా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.






