- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడే ఇంగ్లాండ్ తో సెమీస్..అభిషేక్ శర్మ డౌట్ !
ఇవాళ ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో సెమీస్ ముంబై వేదికగా జరుగనుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఫైనల్స్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న భారత్, నేడు రెండో సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్, భారత్ మధ్య ఇవాళ ముంబై వేదికగా సెకండ్ సెమీస్ జరగనుంది. రాత్రి 7 గంటలకు షురూ కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో... ఇప్పటికే రెండు జట్లు కూడా సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో వరుసగా మూడవ సారి ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతోంది.
2022లో ఇంగ్లాండ్ తో భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ గెలవగా, 2024లో మాత్రం భారత్ విజయం సాధించింది. అలాగే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఐదు సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో మూడు సార్లు భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే 2024 మ్యాజిక్ ను భారత్ రిపీట్ చేసి ఫైనల్ కు చేరుకుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అభిషేక్ శర్మ డౌట్ ?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీస్ నేపథ్యంలో అభిషేక్ శర్మ పై వేటు వేస్తారని అంటున్నారు. అతని స్థానంలో రింకును బరిలోకి దించుతారని చెబుతున్నారు. ఈ టోర్నమెంటులో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో సెమిస్ ఆడిస్తే, ప్రయోజనం పెద్దగా ఉండబోదని భారత జట్టు యాజమాన్యం అతనిపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.






