- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బెటర్.. రికీ పాంటింగ్ కీలక సూచన
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు శనివారం ఇంగ్లాండ్‌కు చేరుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు శనివారం ఇంగ్లాండ్‌కు చేరుకుంది. ఈ నెల 20 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా .. భారత్ తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పలు సూచనలు చేశాడు. ‘సుదర్శన్ టెస్టుల్లో రాణిస్తాడని అనుకుంటున్నా. అతనిలో నాకు క్లాస్, టెక్నికల్ ప్లేయర్ కనిపిస్తున్నాడు. జైశ్వాల్, సుదర్శన్ ఓపెనర్లుగా వస్తారు. అప్పుడు మూడో స్థానంలో రాహుల్, 4వ స్థానంలో గిల్, 5వ స్థానంలో కరుణ్ నాయర్ ఆడొచ్చు. 4వ స్థానంలో గిల్ రావడం అతనికి లాభమే. ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో బ్యాటింగ్ రాకపోవడం వల్ల భారం తగ్గుతుంది.’అని పాంటింగ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే, యువ పేసర్ అర్ష్‌దీప్ తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అతను చాలా నైపుణ్యం కలవాడని, కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉందన్నాడు. అలాగే, డ్యూక్స్ బాల్‌తో అతను ప్రభావం చూపుతాడని చెప్పాడు.






