భారత్ అద్భుత ప్రదర్శన.. మ్యాచ్ డ్రా

by Muthe.Rajitha |   (  Updated:2025-07-27 17:06:25  IST  )

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగవ టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది.

భారత్ అద్భుత ప్రదర్శన.. మ్యాచ్ డ్రా
X

దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy)లో భాగంగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగవ టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. భారత్ పోరాటం ముందు ఇంగ్లాండ్ వెనక్కి తగ్గింది. రెండవ ఇన్నింగ్స్ లో సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్ మీద ఆశలు వదులుకునే పరిస్థితి కల్పించింది. కెప్టెన్ గిల్, ఆల్ రౌండర్ జడేజా, సుందర్ అద్భుతమైన సెంచరీలతో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించారు. అలాగే కేఎల్ రాహుల్ కూడా 90 పరుగులతో అద్భుత ప్రదర్శన చేసాడు. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. భారత్ స్కోర్ తోలి ఇన్నింగ్స్ లో 358/10, రెండో ఇన్నింగ్స్ లో 425/4 కాగా ఇంగ్లాండ్ స్కోర్ 669/10.

Next Story