- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైనల్‌లో భారత్ ఓటమి.. ఆసియా కప్ విజేత చైనా
by Harish |
హాకీ ఆసియా కప్ టైటిల్ వేటలో భారత మహిళల హాకీ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది.

X
దిశ, స్పోర్ట్స్ : హాకీ ఆసియా కప్ టైటిల్ వేటలో భారత మహిళల హాకీ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది. టోర్నీలో సత్తాచాటిన భారత జట్టు ఫైనల్‌లో మాత్రం బోల్తా పడింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో చైనా చేతిలో 4-1 తేడాతో పరాజయం పాలైంది. దీంతో చైనా మూడోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగబోయే హాకీ వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది. ఫైనల్‌లో భారత్‌కు అద్భుత ఆరంభం దక్కింది. తొలి నిమిషంలోనే నవ్‌నీత్ జట్టుకు గోల్ అందించింది. భారత్‌కు అదే చివరి గోల్ అయ్యింది. రెండో క్వార్టర్‌లో చైనా పుంజుకుంది. ఆ జట్టు తరపున ఓయూ జిక్సియా, లీ హోంగ్, జోయూ మెయిరాంగ్, జాంగ్ జియాకీ వరుసగా గోల్స్ చేశారు. భారత్ ఏకైక గోల్‌కే పరిమితమై రన్నరప్‌గా సరిపెట్టింది. మరో మ్యాచ్‌లో సౌత్ కొరియాపై 1-2తో గెలిచిన జపాన్ మూడో స్థానం దక్కించుకుంది.
Next Story






