- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఆసియా కప్ ఫైనల్‌లో అడుగు
ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. ఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టు టీమిండియానే. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది. మరోసారి రెచ్చిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 75 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా(38), గిల్(29) కూడా విలువైన రన్స్ జోడించారు.
ఇక, ఛేదనలో బంగ్లా.. భారత బౌలింగ్ ముందు నిలువలేకపోయింది. 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. సైఫ్ హసన్(69) ఒక్కడే పోరాటం చేయగా.. మిగతా వారు క్రీజులో కూడా నిలువలేకపోయారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ఇద్దరు డకౌటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, బుమ్రా చెరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. భారత్ గెలుపొందడంతో శ్రీలంక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మరో ఫైనల్ బెర్త్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య గురువారం జరిగే పోరులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది.






